బిగ్గెస్ట్ బ్యానర్ లో క్రేజీ కాంబినేషన్ ‘ఆకాశం నీ హద్దురా’ దర్శకురాలి చిత్రం?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మలయాళ సూపర్‌స్టార్ దుల్ఖర్ సల్మాన్ కాంబోలో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం నిర్మించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య , మలయాళ సూపర్‌స్టార్ దుల్ఖర్ సల్మాన్ కాంబోలో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం నిర్మించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ‘కేజీఎఫ్’ సిరీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన హోంబలే ఫిల్మ్స్ వారు ఈ మూవీని నిర్మించనున్నారట. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ప్రభాస్ తో ‘సలార్’ మూవీని భారీ బడ్జెట్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంస్థ ఇటు తమిళంలోనూ, అటు మలయాళంలోనూ క్రేజీ ప్రాజెక్టులు నిర్మించేందుకు దర్శకులను, హీరోలను లాక్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రస్తుతం ఈ సంస్థ పృధ్విరాజ్ సుకుమారన్ తో ఓ సినిమాను నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే సూర్య, దుల్ఖర్ ల కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్‌కు ప్లాన్ చేస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ సుధా కొంగర దర్వకత్వంలో ఈ సినిమా రూపొందనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దర్శకురాలితో సినిమాను ఇది వరుకే ప్రకటించారు. అయితే అప్పుడు హీరో ఎవరనేది వెల్లడించలేదు.
తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టులో సూర్య – దుల్ఖర్ సల్మాన్ కూడా భాగమవడం దాదాపు ఖాయం అని తెలుస్తోంది. ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో సుధా కొంగర, సూర్య భారీ హిట్ అందుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆమెతో కలిసి పనిచేయడానికి సూర్య ఉత్సాహం చూపిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. ఇక సూర్య ప్రస్తుతం విలక్షణ దర్శకుడు బాలా దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి. సూర్యకు జోడీగా నటిస్తోంది. దీని తర్వాత సుధ కొంగర ప్రాజెక్ట్‌లో సూర్య జాయిన్ కానున్నారట.













