Drishyam3: దృశ్యం3కు రంగం సిద్ధం

క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన సినిమాల్లో దృశ్యం(Drishyam) ఫ్రాంచైజ్ కు మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ లో రెండు సినిమాలు రాగా ఆ రెండు సినిమాలూ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. దృశ్యం ఫస్ట్ పార్ట్ అయితే ఇతర భాషల్లోకి కూడా రీమేక్ అయి, ప్రతీ భాషలోనూ సూపర్ హిట్ గా నిలిచింది. దృశ్యం2(Drishyam2) క్లైమాక్స్ లోనే దృశ్యం3 కూడా ఉంటుందని మేకర్స్ ముందే చెప్పారు.
ఇప్పటికే దృశ్యం3(Drishyam3) కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా, మొదటి రెండు భాగాలను మించిన క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడట డైరెక్టర్ జీతూ జోసెఫ్(Jeethu Joseph). అయితే ఇప్పుడు దృశ్యం3 షూటింగ్ త్వరలోనే మొదలుకానున్నట్టు తెలుస్తోంది. దృశ్యం మలయాళ వెర్షన్ షూటింగ్ సెప్టెంబర్ 17న మొదలై, నవంబర్ 10 నాటికి ముగించనున్నారట.
ఆ తర్వాత వెంటనే తెలుగు వెర్షన్ ను నవంబర్ మధ్యలో స్టార్ట్ చేయనున్నారని, అది పూర్తవగానే హిందీ వెర్షన్ 2026 ఏడాది మొదట్లో ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారట. దృశ్యం ఫ్రాంచైజ్ లో వచ్చిన మొదటి రెండు భాగాలూ బ్లాక్ బస్టర్లుగా నిలిచిన నేపథ్యంలో ఇప్పుడు రాబోయే దృశ్యం3పై భారీ అంచనాలున్నాయి. కాగా దృశ్యం మలయాళ వెర్షన్ లో మోహన్ లాల్(Mohan Lal) నటిస్తే, తెలుగు వెర్షన్ లో వెంకటేష్(Venkatesh), హిందీ వెర్షన్ లో అజయ్ దేవగణ్(Ajay Devgan) నటించారు.