Dragon: డ్రాగన్ మూవీ షూటింగ్ అప్డేట్
ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ఎన్టీఆర్ వార్2(War2) షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల రీసెంట్ గానే ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో జాయిన్ అవడం వల్ల ఈ మూవీ షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతుందిప్పుడు.
ఈ సినిమాకు డ్రాగన్(Dragon) అనే టైటిల్ ను పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెంగుళూరులో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఎన్టీఆర్ జాయిన్ అయ్యాక కొత్త యాక్షన్ షెడ్యూల్ ను మొదలుపెట్టింది చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే డ్రాగన్ షూటింగ్ పై ఇప్పుడు ఓ అప్డేట్ వినిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న యాక్షన్ షెడ్యూల్ మరో మూడు వారాల పాటూ అదే లొకేషన్ లో జరుగుతుందని సమాచారం.
సినిమాలోని భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఈ షెడ్యూల్ లో తెరకెక్కించనున్నారని, ఈ సీక్వెన్స్ ను నీల్(Neel) నెక్ట్స్ లెవెల్ లో ప్లాన్ చేశాడని చిత్ర యూనిట్ చెప్తోంది. అయితే ఈ మూడు వారాల్లో ఎన్టీఆర్ మధ్యలో ఓ రెండ్రోజులు బ్రేక్ తీసుకోనున్నాడని కూడా తెలుస్తోంది. డ్రాగన్ సినిమాను ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేలా నీల్ తెరకెక్కిస్తున్నాడని, సినిమాలో ఎన్నో ఫ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయని అంటున్నారు.






