పేద కళాకారులకు అండగా జీవిత, రాజశేఖర్
కరోనా వైరస్ ప్రభావంతో ఈ నెలాఖరు వరకు సినిమా షూటింగ్‌లు ఆపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. చలన చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా మార్చి 31 వరకు షూటింగ్‌లు ఆపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఏరోజుకు ఆ రోజు పని చేస్తే తప్ప ఇల్లు గడవని నిరుపేద కళాకారులు మూవీ ఆర్టిస్టస్ అసోసియేషన్ లో (మా) కొందరు ఉన్నారు. అలాంటి కళాకారులకు పది రోజులకు సరిపడ్డా నిత్యావసర వస్తువులను రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించనున్నట్లు రాజశేఖర్, జీవితా ప్రకటించారు. నిరుపేద కళాకారులు 90108 10140 నంబర్‌కి కాల్ చేసి పూర్తి వివరాలు అందించి తగు సహాయం పొందాలని కోరారు.













