డబుల్ ఇస్మార్ట్ వచ్చేదప్పుడేనా?
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, ఎనర్జిటిక్ స్టార్ కాంబినేషన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మార్చి 8న రిలీజ్ కావాల్సింది కానీ షూటింగ్ లేటవడంతో వాయిదా పడింది. మార్చి నుంచి వాయిదా పడ్డాక కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
అసలు డబుల్ ఇస్మార్ట్ సమ్మర్ లో వస్తుందా లేదా అనే డౌట్స్ ఫ్యాన్స్ లో ఎక్కువైపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సమ్మర్ యాంగిల్ లో చూసుకుంటే కొంత లేట్ అనిపిస్తున్నప్పటికీ బ్యాలెన్స్ ఉన్న షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కు ఆ మాత్రం టైమ్ అవసరమే అంటున్నారు.
ప్రస్తుతం మణిశర్మ డబుల్ ఇస్మార్ట్ రీరికార్డింగ్ వర్క్స్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు షూట్ చేసిన భాగానికి రీరికార్డింగ్ పూర్తి చేయిస్తే తర్వాత ఒత్తిడి తగ్గుతుందనే ఉద్దేశంతో మణిశర్మ ఇలా ప్లాన్ చేసుకున్నాడట. ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని ఇప్పటికే లీకులందుతున్నాయి. డబుల్ ఇస్మార్ట్ లో ఎలాంటి నార్త్ ఫ్లేవర్ లేకుండా పక్కాలోకల్ మాస్ టచ్ ఇస్తున్నాడట పూరీ. ఈ సినిమా విజయం ఇటు రామ్‌కు, అటు పూరీకి ఎంతో అవసరం.













