Arundhathi: త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్టు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క(Anushka) సూపర్ హిట్ సినిమా అరుంధతి(Arundhati)లో చిన్నప్పుడు అరుంధతిగా నటించిన అమ్మాయి దివ్య నగేష్(Divya Nagesh) కు త్వరలోనే పెళ్లి కాబోతుంది. దివ్య చైల్డ్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడు అరుంధతితో పాటూ అపరిచితుడు(Aparichithudu), సింగం పులి(Singam Puli) లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అవి మాత్రమే కాకుండా పలు తెలుగు, తమిళ సినిమాల్లో ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది.
ప్రస్తుతం మోడల్, డ్యాన్సర్ గా ఉన్న దివ్య నగేష్ సినిమాల్లో నటిగా చేయడానికి అవకాశాల కోసం ట్రై చేస్తోంది. గత కొంత కాలంగా కొరియోగ్రాఫర్ అజిత్ కుమార్(Ajith Kumar) తో ప్రేమలో ఉన్న ఆమెకు రీసెంట్ గానే నిశ్చితార్థం జరిగింది. ఆ ఫోటోలను షేర్ చేస్తూ 2020లో అజిత్ తో పరిచయం జరిగిందని, 2025లో ఇద్దరం భార్యాభర్తలం కాబోతున్నామని, అజిత్ తనకు అన్నివిధాలా సపోర్ట్ చేస్తాడని కాబోయే భర్త గురించి వెల్లడించింది దివ్య.
ఈ సందర్భంగా దివ్య, అజిత్ కు శుభాకాంక్షలు తెలుపుతూ, అరుంధతిలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అమ్మాయికే పెళ్లవుతుంది. కానీ అసలైన అరుంధతిగా నటించిన అనుష్కకు మాత్రం ఇంకా పెళ్లి కాలేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. స్వీటీకి ఇప్పటికే 43 ఏళ్లు వచ్చినా పెళ్లి గురించి మాత్రం ఏం మాట్లాడటం లేదు.













