పేరూ పోయే.. డబ్బులూ పోయే..
టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లలో ఒకరు కాకపోయినా సురేందర్ రెడ్డి తనకంటూ ఓ స్పెషల్ నేమ్ క్రియేట్ చేసుకున్నాడు. మొదటి సినిమా అతనొక్కడే నుంచి కిక్, రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు, ధృవ, సైరా లాంటి డీసెంట్ ఫిల్మ్స్ తో సూరి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తన కెరీర్ లో ఎన్ని ఫ్లాపులున్నా, అవేమీ చేయని డ్యామేజ్‌ను అఖిల్ ఏజెంట్ చేసింది. సురేందర్ రెడ్డి నుంచి ఇలాంటి సినిమాను అసలెవరూ ఊహించలేదు కూడా.
బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సినిమాను మొదలుపెట్టామని రీసెంట్ గా అనిల్ సుంకర ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఏజెంట్ ఫెయిల్యూర్ కి సూరీనే కారణమనే నింద ఇప్పుడు ఆయన కచ్చితంగా మోయాల్సిందే. ఇదంతా ఒకెత్తయితే, ఏజెంట్ సినిమాతో కేవలం డైరెక్టర్ గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారి డబ్బులు పోగొట్టుకున్నాడు సురేందర్ రెడ్డి.
సరెండర్ టూ సినిమా పేరిట ఓ కొత్త బ్యానర్‌ను పెట్టి, ఏజెంట్ నిర్మాణంలో భాగస్వామి అయ్యడు సురేందర్ రెడ్డి. సినిమా కోసం డబ్బులేమీ పెట్టకపోయిన సరే, తన రెమ్యూనరేషన్ ను పెట్టుబడిగా పెట్టి, నిర్మాణ భాగస్వామిగా మారాడు సూరీ. సినిమా బాగా పెర్ఫార్మ్ చేసి లాభాలు వస్తే వాటా తీసుకుంటారు. కానీ ఏజెంట్ లా తేడా కొడితే మాత్రం దారుణంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పుడు సురేందర్ రెడ్డి పరిస్థితి కూడా అదే. దీంతో ఏజెంట్ పేరుతో పేరుతో పాటు డబ్బులు కూడా పోగొట్టకున్నాడని సురేందర్ పై అందరూ జాలి చూపిస్తున్నారు.













