Thaman: ఆ బీజీఎం విని సుజిత్ షాకయ్యాడు

పవన్ కళ్యాణ్(pawan kalyan) హీరోగా సుజిత్(sujeeth) దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా ఓజి. సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజి(OG) భారీ అంచనాలతో రిలీజై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా సక్సెస్ లో పవన్ తో పాటూ సుజిత్ స్టైలిష్ మేకింగ్ మరియు తమన్(Thaman) మ్యూజిక్ కీలక పాత్ర పోషించాయి.
ఓజి మూవీలో పవన్ ఫ్యాన్స్ ను సర్‌ప్రైజ్ చేసే అంశాలను సుజిత్ చాలానే పెట్టాడు. తమ హీరోను ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలనుకుని కొంత కాలంగా వెయిట్ చేస్తున్నారో సుజిత్ పవన్ ను అలానే చూపించాడు. దానికి తమన్ బీజీఎం బాగా ఎలివేట్ అవడంతో సీన్స్ బాగా పండాయి. ఓజి సినిమాలోని ఎన్నో అంశాలతో సుజిత్ ఆడియన్స్ ను థ్రిల్ చేస్తే సుజిత్ ను మాత్రం తమన్ సర్‌ప్రైజ్ చేశాడట.
ఓజి మూవీలో సుజిత్ ను సర్‌ప్రైజ్ చేసింది మరేదో కాదు, ట్రావెలింగ్ సోల్జర్ బీజీఎం. రీసెంట్ గా ఆ బీజీఎం గురించి తమన్ ఓ ఇంటర్వ్యూలో చెప్తూ జానీ(Johny) సాంగ్ తో పాటూ ట్రావెలింగ్ సోల్జర్ బీజీఎంను కలిపి, దానికి గన్స్ సౌండ్ ను మిక్స్ చేశానని, వాస్తవానికి జానీ సాంగ్ వరకే సుజిత్ ఆలోచన అని, కానీ తర్వాత దానికి ట్రావెలింగ్ సోల్జర్ ను యాడ్ చేసేసరికి ఆ బిట్ నెక్ట్స్ లెవెల్ లో వచ్చిందని, అది వినగానే సుజిత్ చాలా సర్‌ప్రైజ్ అయ్యాడని చెప్పిన తమన్, తనకు ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ అంటే ఇష్టమని, దాన్ని తన నోకియో ఫోన్ లో ఎక్కించుకుని రింగ్ టోన్ గా కూడా పెట్టుకున్నానని తమన్ తెలిపాడు.