రాజమౌళి మహేష్ కాంబో రూమర్ నిజమేనా..?
ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ ఫినిషింగ్ స్టేజ్ కు చేరుకుంది. వచ్చే నెలతో షూటింగ్ మొత్తం పూర్తి చేసి అక్టోబర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబు తో ఉంటుందని ఇప్పటికే చాలా బలంగా ప్రచారం జరుగుతుంది. గతంలోనే మహేష్ తో సినిమా చేయాలని రాజమౌళి కూడా చెప్పాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి, ప్రముఖ డైరక్టర్ విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.
కొంత కాలంగా రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబో మూవీ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు నడుస్తున్నాయి. ఈ టైమ్ లోనే జక్కన్న చత్రపతి శివాజీ కథతో మహేష్ బాబుతో సినిమాను రూపొందించబోతున్నాడు. దానికి సంబంధించిన స్క్రిప్ట్ ను విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే తయారు చేస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ ను రాజమౌళి చత్రపతి శివాజీగా చూపించబోతున్నాడు అనే పుకార్లు సినిమా ప్రారంభం కాకుండానే ఈ న్యూస్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.













