SS Rajamouli: నా బెస్ట్ మూవీ అదే

టాలీవుడ్ లో అపజయం ఎరుగని డైరెక్టర్ గా దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli)కి పేరుంది. ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చేసిన ప్రతీ సినిమా సూపర్ హిట్టే. అలాంటి రాజమౌళి తీసిన సినిమాల్లో బాహుబలి(Baahubali) సినిమాకు చాలా స్పెషల్ క్రేజ్ ఉంది. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్(RRR) కు అయితే తెలుగు సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లింది.
రాజమౌళి చేసిన సినిమాల్లో బెస్ట్ మూవీ ఏదని ఎవరిని అడిగినా ఈ రెండు సినిమాల్లో ఒక సినిమా పేరు చెప్తారు. కానీ రాజమౌళి మాత్రం తన సినిమాల్లో బెస్ట్ మూవీగా ఈగ(eega) సినిమాను చెప్పారు. జూనియర్(junior) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన రాజమౌళికి అక్కడ స్క్రీన్ పై కొన్ని మూవీస్ కు సంబంధించిన ఫోటోలను చూపిస్తూ కొన్ని ప్రశ్నలు అడగ్గా అందులో ఈగకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది.
అప్పుడు రాజమౌళి ఈగ తన బెస్ట్ సినిమా అని, బాహుబలి మూవీకి పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అవడానికి ఈగ మూవీనే ఓ విధంగా కారణమని చెప్పొచ్చని అన్నారు. తెలుగులో తెరకెక్కిన ఈగ సినిమాను హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్ చేయగా ఎంతోమంది విమర్శకుల నుంచి కూడా ఆ సినిమా ప్రశంసల్ని అందుకుంది. స్టార్ హీరో లేకుండా ఈగను మెయిన్ హీరోగా పెట్టి సినిమాను సక్సెస్ చేయడం రాజమౌళికే చెల్లిందని ఆ సినిమా తర్వాత జక్కన్నను ఎంతో మంది పొగిడిన సంగతి తెలిసిందే. అందుకే రాజమౌళి ఈగ మూవీని బెస్ట్ అని చెప్పి ఉంటారు.