రూమర్స్ కు చెక్ పెట్టిన శంకర్
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడని సమాచారం.
ఇదిలా ఉంటే శంకర్, గేమ్ చేంజర్ తో పాటూ కమల్ హాసన్ తో ఇండియన్2 సినిమా కూడా ఒకేసారి తీస్తున్నాడు. రెండూ పెద్ద ప్రాజెక్ట్స్ అయినప్పటికీ శంకర్ మాత్రం ఇండియన్2 పై ఎక్కువ దృష్టి పెట్టడంతో దిల్ రాజు గేమ్ చేంజర్ బాద్యతలను మరో దర్శకుడికి అప్పగించారని ఆ మధ్య టాక్ వినిపించింది.
అయితే రీసెంట్ గా ఈ వార్తలకు చెక్ పెడుతూ శంకర్ గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేస్తూ ఓ ఫోటో షేర్ చేశాడు. దీంతో గేమ్ చేంజర్ మూవీపై వచ్చిన రూమర్స్ కు చెక్ పడింది. ఇదిలా ఉంటే తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లిరికల్ ను దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ సాంగ్ షూటింగ్ కూడా అయిపోయినట్లు సమాచారం.













