Shankar: ఆశలు పెంచిన శంకర్
ఎప్పుడూ లేనిది గతేడాది ఇండియన్2(Indian2) రిలీజ్ అయ్యాక శంకర్(Shankar) విపరీతమైన ట్రోలింగ్ కు గురయ్యాడు. ఆయన్నుంచి ఐ(I) లాంటి ఫ్లాపులొచ్చినప్పుడు కూడా ఇన్ని విమర్శలు రాలేదు. దానికి కారణం ఆయన మేధాశక్తి అంటే అందరికీ ఉన్న గౌరవం. అప్పుడెప్పుడో వచ్చిన ఇండియన్(Indian) సినిమాకు సీక్వెల్ తీయాలనే తొందరపాటులో కథా కథనాలు సరిగ్గా కుదిరాయో లేదో చూసుకోకుండా బాగా ఖర్చు పెట్టడం వల్ల ఆ సినిమాకు దారుణ ఫలితం దక్కింది.
అయితే ఇండియన్2 ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్(Game Changer) పై ఎక్కడ పడుతుందోనని మెగా ఫ్యాన్స్ పడిన టెన్షన్ మామూలుది కాదు. కానీ గేమ్ ఛేంజర్ ట్రైలర్(Game Changer Trailer) చూశాక అన్ని డౌట్స్ తీరిపోయాయి. ఒక కమర్షియల్ పొలిటికల్ థ్రిల్లర్ నుంచి ఏమేం ఆశిస్తామో అవన్నీ గేమ్ ఛేంజర్ లో శంకర్ బాగా బ్యాలెన్స్ చేసి డీల్ చేసినట్టు అనిపిస్తోంది.
ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత చరణ్ కు కోలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది. గేమ్ ఛేంజర్ సినిమాపై కోలీవుడ్ మీడియాలో పాజిటివ్ టాక్ ఉంది. కాబట్టి ట్రైలర్ లాగానే సినిమా కూడా బావుంటే చరణ్ మార్కెట్ కోలీవుడ్ లో పెరగడం ఖాయం. అంతేకాదు శంకర్ ఇండియన్3కి మంచి బజ్ రావాలన్నా, బిజినెస్ జరగాలన్నా ఈ సినిమా బాగా పెర్ఫార్మ్ చేయాలి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే చరణ్ రికార్డులు బద్దలు చేయడం ఖాయం.













