హీరోయిన్ వేటలో క్రిష్
హరిహర వీరమల్లు సినిమా అనుకున్నప్పుడు ఆ సినిమా తర్వాత తన జీవితమే మారిపోతుందనుకున్నాడు డైరెక్టర్ క్రిష్. కానీ షూటింగ్ బాగా లేటవడం, సెట్స్ కూలడం, జనసేన పనుల్లో పవన్ బిజీగా అవడం, త్వరగా రీమేక్ సినిమాలను ఫినిష్ చేయాలనుకోవడంతో ఆ ఎఫెక్ట్ వీరమల్లు మీద పడింది.
దీంతో మధ్యలో వైష్ణవ్ తేజ్ తో కొండపొలం తీశాడు కానీ అది డిజాస్టర్ గా మిగిలింది. ఓ వైపు డైరెక్టర్ గా ఉంటూనే క్రిష్ నిర్మాతగా వ్యవహరిస్తూ వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నాడు. ప్రముఖ రైటర్ మల్లాది వెంకట కృష్ణ మూర్తి రాసిన నవల ఆధారంగా 9 అవర్స్ అనే సిరీస్ ను వేరే డైరెక్టర్ తో చేయించాడు. తర్వాత కన్యాశుల్కం ఆధారంగా అంజలి- అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో మరో సిరీస్ ను కూడా పూర్తి చేశాడు.
అయితే ఈ రెండు సిరీస్లు తను దర్శకత్వం వహించినవి కావు. అందుకే తను ఓ లేడీ ఓరియెంటెడ్ స్టోరీని రెడీ చేసుకుని హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నాడట. ఫస్ట్ ప్రియారిటీగా అనుష్కను, సెకండ్ ఆప్షన్ గా నయనతారను అనుకుంటున్నాడట. చిరంజీవి విశ్వంభర మూవీనే చేయాలా వద్దా అనుకుంటున్న అనుష్క, క్రిష్ సినిమాను ఓకే చేస్తుందా అన్న డౌట్ ఓ వైపున ఉంటే, నయనతారకు తెలుగు లో మార్కెట్ లేకపోవడం, భారీ రెమ్యూనరేషన్లు రీజన్లు గా కనిపిస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో క్రిష్ ఏ హీరోయిన్ తో ముందుకెళ్తాడో చూడాలి.













