70 ఏళ్ల వయస్కుడిగా కనిపించనున్న బాలయ్య
ఈ మధ్య బాలయ్య ఫుల్ జోష్ లో ఉన్నాడనే చెప్పాలి. అఖండ తో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన బాలయ్య ఆ తర్వాత అన్‌స్టాపబుల్ అనే షోకు హోస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్గా వచ్చిన వీర సింహారెడ్డి సినిమా కూడా హిట్ అవడంతో ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు బాలయ్య, అతని ఫ్యాన్స్. ప్రస్తుతం బాలయ్య, అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాపై అందరికీ మొదటి నుంచే మంచి అంచనాలుండగా, రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలను డబుల్ చేసేసింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ మామూలు ఖుషీలో లేరు. రీసెంట్‌గానే తన తర్వాతి సినిమాను కూడా బాలయ్య అనౌన్స్ చేశాడు. వాల్తేరు వీరయ్యతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ బాలయ్యను డైరెక్ట్ చేయనున్నాడు.
ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజే ఓ పోస్టర్‌ను రిలీజ్ చేయగా, ఆ పోస్టర్ అందరిలోనూ క్యూరియాసిటీని పెంచింది. వీలైనంత త్వరగా భగవంత్ కేసరిని పూర్తి చేసి, బాబీ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు బాలయ్య. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది.
బాబీ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేయనున్నాడని, తండ్రీ కొడుకుల పాత్రల్లో బాలయ్య కనిపిస్తాడని టాక్. 70 ఏళ్ల వయసున్న వ్యక్తిగా బాలయ్య ఇంటర్వెల్ లో దర్శనమిస్తాడని, అక్కడ నుంచి ఆయన పాత్రే సినిమాకు మెయిన్ అని తెలుస్తోంది. బాలయ్య ఇలా చేయడం ఆయనకేమీ కొత్త కాదు. తన గత సినిమాల్లో బాలయ్య రెండు క్యారెక్టర్లు పోషించి మంచి హిట్లు అందుకున్నాడు. అందుకే డైరెక్టర్లంతా ఆ ఫార్ములాని వాడి సినిమాకు హైప్ తెస్తున్నారని టాక్.













