Bobby: బాబీ ఇబ్బంది పడింది ఆ నిర్మాణ సంస్థ వల్లేనా?
పవర్(Power) సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన బాబీ(Bobby Kolli), ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్(Sardar Gabbar singh) తో ఫ్లాప్ అందుకున్నప్పటికీ జై లవకుశ(jai lava kusa)తో మంచి హిట్ అందుకున్నాడు. తర్వాత అతన్నుంచి వెంకీ మామ, వాల్తేరు వీరయ్య(waltair Veerayya) సినిమాలొచ్చాయి. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ(balakrishna) హీరోగా రూపొందిన డాకు మహరాజ్(Daku Maharaj) సంక్రాంతి రిలీజ్ కు రెడీ అయింది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బాబీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాను గతంలో తీసిన ఓ సినిమా విషయంలో నిర్మాణ సంస్థ వల్ల ఇబ్బందులు పడ్డానని, ఆ సినిమా హిట్ అయినప్పటికీ, ఆ సినిమా స్థాయికి అది ఇంకా పెద్ద రేంజ్ కు వెళ్లాల్సిన సినిమా అని, తాను కోరుకున్న బడ్జెట్ ఇచ్చి ఉంటే సినిమా నెక్ట్స్ లెవెల్ లో ఉండేదని బాబీ అభిప్రాయపడ్డాడు.
దీంతో బాబీ ఏ సినిమా గురించి అలా మాట్లాడాడనేది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే బాబీ చెప్పిన దాన్ని గురించి ఎక్కువ ఆలోచించే పన్లేదని, జై లవకుశ(Jai Lava Kusa) సినిమా గురించే బాబీ అలా మాట్లాడాడని ఎన్టీఆర్ ఫ్యాన్సే తేల్చి చెప్తున్నారు. కళ్యాణ్ రామ్(Kalyan Ram) బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్(NTR Arts) గురించే బాబీ చెప్పాడని, నిర్మాణ విలువల విషయంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ రాజీ పడుతుందని ఎన్టీఆర్ అభిమానులు చెప్తున్నారు. ఇక ముందైనా సినిమాలు తీసేటప్పుడు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా మంచి క్వాలిటీతో సినిమాలు చేస్తే బావుంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.













