దసరాకు దిల్ రాజు నుంచి రెండు సినిమాలు
ప్రొడ్యూసర్ గా మంచి పొజిషన్ కు వెళ్లినా దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ ను మాత్రం ఆపలేదు. ఓ వైపు భారీ సినిమాలను నిర్మిస్తూనే మరోవైపు నైజాం లో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు రాజు. కానీ ఏ సినిమాను పడితే ఆ సినిమాను దిల్ రాజు కొనడు. ఏ సినిమా అయితే జనాలకు రీచ్ అవుతుందో అలాంటి సినిమాలనే ఆయన కొని రిలీజ్ చేస్తుంటాడు.
రీసెంట్ గా జైలర్ రూపంలో జాక్ పాట్ కొట్టిన దిల్ రాజు ఈ సినిమాతో మూడింతల ఆదాయాన్ని రాబట్టాడు. రజినీ ఫ్లాపుల్లో ఉండటం వల్ల జైలర్ రైట్స్ తక్కువ రేట్ కే దిల్ రాజుకు దక్కాయి. దీంతో భారీ లాభాలు వస్తున్నాయి. రాబోయే నాలుగు నెలల్లో కూడా దిల్ రాజు నుంచి మరిన్ని పెద్ద సినిమాలు రాబోతుండగా, దసరా కు మాత్రం ఒకేసారి రెండు సినిమాలను నైజాం లో దిల్ రాజు రిలీజ్ చేస్తుండటం విశేషం.
ఇప్పటికే అనిల్ రావిపూడి- బాలకృష్ణ కాంబోలో వస్తున్న భగవంత్ కేసరి నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్న దిల్ రాజు, ఈ సినిమాతో పాటూ లియో నైజాం రైట్స్ ను కూడా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. లియో తెలుగు రైట్స్ ను సితార సంస్థ తీసుకోగా వారి నుంచి నైజాం రైట్స్ ను దిల్ రాజు కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఇలా ఒకేసారి రెండు పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయడం దిల్ రాజుకేమీ కొత్త కాదు. గతంలో సంక్రాంతి టైమ్ లో కూడా ఆయన ఇలా చాలా సినిమాలు చేశాడు. భగవంత్ కేసరి మీద భారీ అంచనాలుండటంతో ఈ సినిమా రైట్స్ ను దిల్ రాజు భారీ రేటుకే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. లియో మీద కూడా మంచి అంచనాలున్నాయి. మరి ఈ దసరాకు దిల్ రాజు జాక్ పాట్ కొడతాడమో చూడాలి.













