‘ఎఫ్ 2 ‘ 100కోట్ల గ్రాస్ ను సాధించినందుకు సంతోషంగా ఉంది- నిర్మాత దిల్ రాజు
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’ చిత్రాలతో వరుస విజయాలను సాధించిన డైరెక్టర్ అనీల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎఫ్ 2.. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ టాక్ తెచ్చుకొని 100 కోట్ల గ్రాస్‌ను సాధించి కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన థాంక్స్ మీట్లో…
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – ”మా సినిమా రెండు వారాలలో 100కోట్ల గ్రాస్‌ను సాధించింది అని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. ఇంకా కలెక్షన్ల పరంగా సినిమా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఈ సినిమాలో అనీల్ ఇంకాకొన్ని సీన్లు రాసి షూట్ చేశారు. వాటిని ఎడిటింగ్‌లో తీసేయడం జరిగింది. సినిమా మంచి విజయం సాధించాక ఇప్పుడు మళ్లీ ఆ సీన్లు యాడ్ చేస్తే బాగుంటుంది అని అనిల్, నేను నిర్ణయించి మళ్లీ ఆ సీన్లు యాడ్ చేయడం జరిగింది. 5 సీన్లు జనవరి 26 నుండి అన్ని థియేటర్లో ప్రదర్శింపబడతాయి. కొత్తసీన్లతో ప్రేక్షకులు సినిమాను మరింత ఎంజాయ్చేసి ఇంకా పెద్దహిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ సాధించిన సందర్భంగా మా బ్యానర్ తరపున అన్నీ థియేటర్లకు షీల్డ్స్ బహుమతిగా పంపడం జరుగుతుంది. అల్టిమేట్ సక్సెస్ ఇచ్చిన హీరోస్ వెంకటేష్, వరుణ్‌తేజ్‌లకు, హీరోయిన్స్ తమన్నా, మెహరిన్ లతోసహా ‘ఎఫ్2’ టీం అందరికి థాంక్స్” అన్నారు.
దర్శకుడు అనీల్ రావిపూడి మాట్లాడుతూ – ”నా కల సాకారమైనందుకు చాలాహ్యాపీగా ఉంది. ఇలాంటి కల ప్రతి దర్శకుడికి ఉంటుంది. కాని నా కల నెరవేర్చిన ప్రేక్షకులకు, నా టీం అందరికి కృతజ్ఞతలు. కొత్త సీన్లతో సినిమాలో ఇంకా ఎక్కువ నవ్వులు ఉంటాయి. ముఖ్యంగా ఇంతపెద్ద విజయం సాధించడానికి సపోర్ట్ చేసిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌కి, దిల్‌రాజు గారికి, శిరీష్, లక్ష్మణ్ గారికి థాంక్స్. ఈ సినిమా విజయం సాధించడానికి మెయిన్ పిల్లర్స్ .. వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు థాంక్స్..12 సంవత్సరాలుగా వెంకటేష్ గారు వదిలేసిన ఎనర్జి ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్లా ఉంటుంది. వరుణ్ ఈ సినిమాలో సీనియర్స్‌తో కలిసి చాలా బాగా నటించారు. తమన్నా, మెహరిన్లకు ఇది మరోమంచి సినిమా.. తమన్ సంగీతం ఈ సినిమాకు బ్యాక్‌బోన్‌లా నిలిచింది. తనకి ఈ సినిమామంచిగుర్తింపునుతెచ్చింది. సినిమాను ఇంతపెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు స్పెషల్ థాంక్స్” అన్నారు.
హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ – ”సినిమా భారి విజయాన్ని సాదించినందుకు చాలా మందికి థాంక్స్ చెప్పాలి. ముందుగా దిల్‌రాజు గారు .. ‘హ్యాపిడేస్’ నుండి ఆయన మ్యాజిక్ చేస్తున్నారు.. ఇప్పుడు ‘ఎఫ్ 2’ సక్సెస్‌తో ఆయన నా విన్నింగ్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఈ సినిమా విడుదలై విజయం సాధించాకే అనిల్ గారు నవ్వడం చూశాను. ఆయన ఈ సినిమాను చాలా కష్టపడి తెరకెక్కించారు. అనిల్ లేకుంటే ఈ ప్రాజెక్ట్ లేదు. వరుణ్ ఈ సినిమాతో నాకు ఫేవరేట్ యాక్టర్ అయ్యారు. వెంకటేష్ గారు సినిమాను మరో రేంజ్‌కి తీసుకెళ్లారు. మెహరిన్ ఈ సినిమాలో ఎప్పుడు కనిపించినా చాలా నవ్వుకునేదానిని. అంత మంచి పెర్ఫామెన్స్ ఇచ్చింది. తమన్ మ్యూజిక్ బాగుంది. ఎఫ్2 టీం అందరికి థాంక్స్” అన్నారు.
నటి ప్రగతి మాట్లాడుతూ – ”ఇలాంటి సినిమాకోసమే నేను, ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. అన్ని విధాలుగా ఈ సినిమా విజయం సాధించింది. మంచి సినిమా,మంచి పాత్ర అందించిన అనిల్ గారికి థాంక్స్. దిల్‌రాజుగారు, అనిల్ గారు ఇలాంటి అద్భుతమైన సినిమాలు మరెన్నో తెరకెక్కించాలని కోరుకుంటున్నాను” అన్నారు.













