Laya: లయ జీతం విని షాకైన దిల్ రాజు

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన లయ(Laya) కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పిల్లలు రావడంతో ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయిపోయిన లయ, ఇప్పుడు మళ్లీ చాలా ఏళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తోంది. నితిన్(Nithin) హీరోగా నటిస్తోన్న తమ్ముడు(Thammudu) సినిమాతో లయ కంబ్యాక్ ఇవ్వబోతుంది.
తమ్ముడు సినిమాలో నితిన్ కు అక్క పాత్రలో లయ కనిపించబోతుంది. తమ్ముడు సినిమాలో ఆమె క్యారెక్టర్ కు చాలా ప్రాధాన్యత ఉందట. ఈ సినిమా మొత్తం అక్కా- తమ్ముడు సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో సాగనుండగా, తమ్ముడు మూవీ కోసం నిర్మాత దిల్ రాజు లయను స్పెషల్ గా పిలిపించారట. యూఎస్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న లయకు దిల్ రాజు(Dil Raju) ఫోన్ చేసి చెప్పగానే ఈ సినిమాకు ఆమె ఒప్పుకుందట.
అదే సందర్భంగా దిల్ రాజు లయకు ఆ జాబ్ ద్వారా శాలరీ ఎంతనేది కూడా అడగ్గా, ఆమె చెప్పిన ప్యాకేజ్ కు రాజు గారికి మతి పోయిందట. ఇండస్ట్రీలో ఉద్యోగంలో వచ్చినంత రాదనీ, అది కూడా ఓ సినిమా కోసం జాబ్ వదిలేసి రావడం కరెక్టా కాదా అనేది ఆలోచించుకోమన్నారని, తమ్ముడు సినిమాలో ఆమె క్యారెక్టర్ కు చాలా ప్రాధాన్యత ఉండటంతో, తన రీఎంట్రీకి ఇదే కరెక్ట్ టైమ్ అనుకుని జాబ్ ను కూడా వదిలేసి వచ్చినట్టు లయ చెప్పింది. ఆమె చెప్పినదాన్ని బట్టి చూస్తుంటే లయ తన రీఎంట్రీ విషయంలో చాలా సీరియస్ గానే ఉన్నట్టు అర్థమవుతుంది.