Dil Raju: విజయ్ సినిమా టైటిల్ ను లీక్ చేసిన దిల్ రాజు
వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ(Vijay devarakonda) ప్రస్తుతం కింగ్డమ్(Kingdom) సినిమాచేస్తున్న విషయం తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు విజయ్. రీసెంట్ గా రిలీజైన టీజర్ దానికి తగ్గట్టే సినిమాపై అంచనాలను బాగా పెంచేసింది. మే 30న ఈ సినిమా రిలీజ్ కానుంది.
కింగ్డమ్ తర్వాత విజయ్ పలు సినిమాలను కమిట్ అవగా అందులో దిల్ రాజు(Dil Raju) బ్యానర్ లో ఓ సినిమా ఉంది. విజయ్ హీరోగా గతేడాది దిల్ రాజు చేసిన సినిమా ఫ్యామిలీ స్టార్(Family Star) ఫ్లాప్ అవడంతో అప్పుడే విజయ్ తో మరో సినిమాను అనౌన్స్ చేశాడు దిల్ రాజు. రాజా వారు రాణి గారు(Raja Varu Rani Garu) ఫేమ్ రవికిరణ్ కోలా(Ravi Kiran Kola) ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా టైటిల్ ను రీసెంట్ గా దిల్ రాజు ఓ సందర్భంలో లీక్ చేశాడు. విజయ్- రవికిరణ్ కాంబోలో వస్తున్న సినిమాకు రౌడీ జనార్థన అనే టైటిల్ ను ఫిక్స్ చేశామని ఆయన తెలిపాడు. యాక్షన్ డ్రామాగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న రౌడీ జనార్థన(Rowdy Janardhana) వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు దిల్ రాజు చెప్పాడు.













