ఓటీటీ వ్యాపారంలోకి దిల్ రాజు
ఓటీటీ అంటే ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఈ ప్లాట్ పామ్ కోసం చాలా భారీ మొత్తంలో పెట్టుబడి అవసరం. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు కొనడం, ఒరిజినల్స్ ను నిర్మించడం, వాటి డీల్స్ చేయడం చాలా పెద్ద తతంగమే ఉంటుంది. దీన్ని మేనేజ్ చేయడం మామూలు వ్యక్తులు వల్ల కాదు. రెగ్యులర్ గా సినిమాలు తీసే నిర్మాతలకు సైతం ఇది చాలా పెద్ద టాస్కే.
కానీ టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ఆహా అనే ఓటీటీని మొదలుపెట్టి దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాడు. ఆహా స్టార్ట్ చేస్తున్నప్పుడు దాని సక్సెస్ మీద చాలా డౌట్స్ వచ్చాయి కానీ నెమ్మదిగా దాన్ని సక్సెస్ దిశగా తీసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు అల్లు అరవింద్ ని చూసి దిల్ రాజు స్ఫూర్తి పొందాడో ఏమో కానీ ఆయన కూడా ఓటీటీ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంలో దిల్ రాజు నుంచి త్వరలోనే క్లారిటీ రానున్నట్లు సమాచారం. ఆ ఓటీటీ కోసం కంటెంట్ క్రియేషన్ మీద ఇప్పుడు దిల్ రాజు ఫోకస్ చేశాడని సమాచారం. దీని కోసం దాదాపు 25 చిన్న సినిమాలను నిర్మించే ప్రయత్నంలో ఆయన ఉన్నాడట. ఆ ఓటీటీ కోసం దిల్ రాజు తో పాటూ మరికొందరు నిర్మాతలు కూడా చేతులు కలుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగో దిల్ రాజు నిర్మించిన సినిమాలు ఓ యాభై ఉన్నాయి. వీటికి తోడు మరికొన్ని సినిమాలను నిర్మించనున్నాడు కాబట్టి ఈ ఓటీటీని దిల్ రాజు సక్సెస్ చేస్తాడని అందరూ నమ్ముతున్నారు.













