బన్నీతో దిల్ రాజు ఐకాన్ ఉండేనా?
బన్నీ చేస్తున్న పుష్ప సినిమా షూటింగ్ సగానికి పైగానే పూర్తయింది. పుష్ప తర్వాత బన్నీ వెంటనే కొరటాలతో సినిమా చేయనున్నట్లు ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. కానీ కొరటాల శివ ఆచార్య పూర్తైన వెంటనే ఎన్టీఆర్30 చేయబోతున్నట్లు ప్రకటించాడు. దీంతో బన్నీ సినిమా లేట్ అవడం ఖాయంగా కనిపిస్తుంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ లో బన్నీ, కొరటాల సినిమా ఉండే అవకాశముందని ప్రొడ్యూసర్లు చెప్తున్నారు. కొరటాలతో సినిమా లేట్ అవుతున్నందున బన్నీ తర్వాత సినిమా డేట్స్ కోసం దిల్ రాజు ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. రెండేళ్ల ముందే బన్నీతో సినిమా చేసేందుకు ఒప్పించుకున్న దిల్ రాజు డేట్స్ విషయంలో ఇబ్బంది పడుతున్నాడు. వేణు శ్రీరామ్ డైరక్టర్ గా బన్నీ హీరోగా ఐకాన్ సినిమా చేసేందుకు దిల్ రాజు అనుకుంటున్నాడట. కానీ బన్నీ మాత్రం ఆ సినిమాను ఇన్ని రోజులు హోల్డ్ లో పెడుతూ వచ్చాడు. బన్నీ పుష్ప తర్వాత ప్రాజెక్ట్ కు గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ లో ఐకాన్ ను చేయాల్సిందిగా కోరుతూ నిర్మాత దిల్ రాజు నుంచి బన్నీకి మెసేజ్ వెళ్లిందట. ఒకట్రెండు రోజుల్లో తప్పకుండా ఐకాన్ సినిమాకు సంబంధించి కీలక విషయం అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలున్నాయంటున్నారు.
వకీల్ సాబ్ సినిమా సక్సెస్ అయితే ఐకాన్ సినిమాను తప్పకుండా మొదలెట్టడం ఖాయమనుకుని భావించారు. వేణు శ్రీరామ్ కు వకీల్ సాబ్ తో మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి బన్నీ ఇంకో ఆలోచన చేయకుండా వేణు శ్రీరామ్ తో సినిమాను సెట్స్ మీదకు తెసుకెళ్లొచంటూ విశ్లేషకులు కూడా అనుకుంటున్నారు. ఇదే నిజమైతే దిల్ రాజు బ్యానర్ లో త్వరలోనే బన్నీ సినిమా ఉండేట్లుంది. ఈ విషయంలో బన్నీ డెసిషన్ మీద ఆధారపడి ఉంది.













