చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన దిల్ రాజు
స్టార్ హీరోల సినిమాల మొదలవడం ఆలస్యం, ఫ్యాన్స్ అప్డేట్ కావాలంటూ తెగ గోల చేస్తుంటారు. తమ పని తాము చేసుకుంటూ పోతామంటే ఫ్యాన్స్ తో కుదరదు. ఈ మధ్య కాలంలో అప్డేట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన ఫ్యాన్స్ అంటే రామ్ చరణ్ ఫ్యాన్సే. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ నుంచి ఎప్పుడెప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని చరణ్ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఎప్పట్నుంచో ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేస్తామంటూ చిత్ర బృందం ఊరిస్తోంది కానీ అది ఎంతకూ రిలీజ్ అవడం లేదు. గతంలో ఆ సాంగ్ కు సంబంధించిన రా వెర్షన్ ఆన్లైన్ లో లీకైంది. అందుకే వెంటనే సాంగ్ ను రిలీజ్ చేద్దామని పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. కానీ ఎందుకో కానీ సాంగ్ రిలీజ్ ను ఆపేశారు.
అయితే ఇప్పుడు గేమ్ ఛేంజర్ నుంచి సాంగ్ లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు ఈ మేరకు అప్డేట్ ఇచ్చారు. లవ్ మి టీజర్ లాంచ్ లో దిల్ రాజు ఈ గుడ్ న్యూస్ చెప్పారు. గేమ్ ఛేంజర్ అప్డేట్ గురించి చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో, బయటా చాలా గొడవ చేస్తున్నారని, మార్చి 27న చరణ్ బర్త్ డే సందర్భంగా గేమ్ ఛేంజర్ నుంచి అప్డేట్ రాబోతుందని దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు నానితో బలగం వేణు డైరెక్ట్ చేయబోయే సినిమాకు యెల్లమ్మ అనే టైటిల్ ను కూడా దిల్ రాజు కన్ఫర్మ్ చేశాడు.













