డెవిల్కు దిల్ రాజు అండ
కళ్యాణ్ రామ్ హీరోగా ఈ నెల 29న రిలీజ్ కానున్న యాక్షన్ థ్రిల్లర్ డెవిల్. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ సినిమాకు సంబంధించిన ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ ను దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 22న సలార్ రిలీజ్ అవుతుండటంతో డెవిల్కు థియేటర్లు దొరుకుతాయా లేదా అనుకుంటున్న టైమ్ లో దిల్ రాజు సీన్లోకి ఎంటరయ్యాడు.
సలార్ కు మంచి టాక్ వస్తే ఎంతలేదన్నా రెండు వారాల పాటూ ఆ ప్రభంజనాన్ని తట్టుకోవడం ఎవరి వల్లా కాదు. కానీ డెవిల్ పై ఉన్న నమ్మకంతో అభిషేక్, సలార్ వచ్చిన వారానికే డెవిల్ ను థియేటర్లలోకి దింపుతున్నాడు. ఇప్పుడు దీనికి దిల్ రాజు అండ దొరికింది కాబట్టి ప్రాబ్లమ్ తగ్గిపోతుంది. ఆయన ఆధ్వర్యంలో నడిచే స్క్రీన్లలో అవసరమైనన్ని డెవిల్ కు ఇచ్చే ఛాన్సుంది.
అప్పటికి సలార్ మొదటి వారం పూర్తి చేసుకుంటుంది కాబట్టి డెవిల్ కు పెద్దగా ఇబ్బంది ఉండదు. డెవిల్ కు మంచి టాక్ వస్తే జనవరి 12 వరకు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించొచ్చు. ఎలాగూ డెవిల్ ట్రైలర్ తో అంచనాలు పెంచేసింది. దానికి తోడు సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అమ్మడు ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ హిట్టే కావడంతో ఆ సెంటిమెంట్ కూడా వర్కవుట్ అవుతుందంటున్నారు. ఈ సినిమా సక్సెస్ పై కళ్యాణ్ రామ్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.













