Dil Raju: నితిన్ అది అఛీవ్ చేయలేకపోయాడు

నితిన్(Nithin) హీరోగా వేణు శ్రీరామ్(Venu SriRam) దర్శకత్వంలో దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా తమ్ముడు(Thammudu). జులై 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ తో పాటూ దిల్ రాజు పాల్గొంటుండగా, తాజాగా దిల్ రాజు, నితిన్ ఓ చిట్ చాట్ ఇంటర్వ్యూ నిర్వహించారు.
ఆ ఇంటర్వ్యూలో నితిన్ దిల్ రాజును ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగాడు. దిల్ సినిమా నుంచి తమ్ముడు సినిమా వరకు మీరు నాలో చూసిన మార్పులు, ప్లస్, మైనస్ ల గురించి చెప్పమన్నాడు. దానికి దిల్ రాజు మాట్లాడుతూ, నువ్వు నా కంటే ఒక సంవత్సరం సీనియర్ అని, నీ తర్వాతే నేను ఇండస్ట్రీలోకి వచ్చానని, ఇప్పుడు ఎలాంటి సినిమానైనా హ్యాండిల్ చేసే కెపాసిటీ నీకుందని దిల్ రాజు నితిన్ తో అన్నాడు.
నీ కంటే ఒక సంవత్సరం లేట్ గా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ నిర్మాతగా నేను ఒక్కొక్కటి అఛీవ్ చేస్తూ టాప్ నిర్మాతగా మారానని, నితిన్ ను కూడా తాను అలానే ఊహించానని కానీ అది జరగలేదన్నాడు. ఆర్య(Arya) సినిమా చేస్తున్నప్పుడు అల్లు అర్జున్(Allu Arjun)ని, దిల్ మూవీ చేస్తున్నప్పుడు నిన్ను ఫ్యూచర్లు స్టార్లు అవుతారని అనుకున్నానని, బన్నీ తన అంచనాలను అందుకున్నప్పటికీ నితిన్ మాత్రం తన అంచనాలను అందుకోలేకపోయాడని దిల్ రాజు అన్నాడు.