పుష్ప విషయంలో దీన్ని నమ్మొచ్చా?
బన్నీ- సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప2 మీద ఏ రేంజ్లో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్క్రిప్ట్ కోసమే ఏడాదికి పైగా ఖర్చు పెట్టిన సుకుమార్, సినిమా నిర్మాణం విషయంలో కూడా అసలు రాజీ పడట్లేదు.
అందుకే సినిమా ఎంత లేటవుతున్నా, స్ట్రెస్ తీసుకోకుండా, ఫలానా సీజన్‌కు సినిమా రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు సుకుమార్. దానికి తగ్గట్టే బన్నీ కూడా పూర్తి సహకారం ఇవ్వడంతో సుకుమార్ మీద ఎలాంటి ప్రెజర్ లేదు. ఏప్రిల్ 8న స్పెషల్ టీజర్ రాబోతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే పుష్ప డిజిటల్ రైట్స్‌కు మైత్రీ నిర్మాతలు 200 కోట్లు ఆశిస్తున్నారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. నెట్‌ఫ్లిక్స్ ఈ డీల్‌ను వదులుకోకూడదని అనుకుంటుందట. రీసెంట్ గా వీరసింహా రెడ్డి తప్పించి, మిగతా మైత్రీ బ్యానర్లోని సినిమాలన్నీ ఈ ఓటీటీకే ఇచ్చారు. అయితే పుష్పకు మరీ ఈ రేంజ్ అమౌంట్ అంటే కష్టమని చర్చలు నడుస్తున్నాయి.
ఇదిలా ఉంటే బన్నీ బర్త్ డే సందర్బంగా పుష్ప టీమ్ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించ మాట్లాడుకునేలా ప్లాన్ చేసిందట. అందులో భాగంగానే ఈ రెండు వందల కోట్ల ఓటీటీ ఆఫర్ టాక్ న కూడా బయటకు స్ప్రెడ్ చేశారట. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది మైత్రీ నిర్మాతలకే తెలియాలి. ఎంత క్రేజ్ ఉన్నా ఒక సినిమాకు ఓటీటీ లో రిలీజ్ అవడానికి అంత మొత్తం అంటే నమ్మశక్యంగా లేదు. కానీ ఒకవేళ ఈ టాక్ నిజమైతే మాత్రం బన్నీ ఈ విషయంలో రికార్డు సృష్టించినట్లే.













