ఆ విషయంలో విజయ్ తర్వాతే నాని
ఈ మధ్య సినిమా సినిమాకీ తేడా చూపిస్తున్న నేచురల్ స్టార్ నాని వరుస సక్సెస్‌లు అందుకుంటున్నాడు. నాని అకౌంట్స్ లో ఫ్లాపులు చాలా తక్కువ. దానిక్కారణం నాని సెలెక్ట్ చేసుకునే కథలే. రీసెంట్గా హాయ్ నాన్న తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని, మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
నాని నటించిన శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికీ, దసరా, హాయ్ నాన్న సినిమాలు తెలుగుతో పాటూ ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయ్యాయి. కానీ ఈ సినిమాలకు ఇతర భాషల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఎంత ప్రమోషన్స్ చేస్తున్నా సరే నాని ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించలేకపోతున్నాడు. మరోవైపు విజయ్ దేవరకొండ మాత్రం తన ఫ్లాప్ సినిమాలతో కూడా వేరే భాషల ఆడియన్స్ కు బాగా రీచ్ అయ్యాడు.
ఒకప్పుడు నాని సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన విజయ్ దేవరకొండ, ఈ విషయంలో ఇప్పుడు నానిని దాటి వెళ్లిపోయాడు. లైగర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ట్రై చేసిన విజయ్‌కు ప్రమోషన్స్ టైమ్ లోనే నార్త్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్ లో దమ్ము లేక లైగర్ ఫ్లాప్ అయింది. అలాగే రీసెంట్ గా వచ్చిన ఖుషి కూడా తమిళంలో మంచి కలెక్షన్లను రాబట్టింది. దీన్ని బట్టి చూస్తుంటే నానితో పోలిస్తే విజయ్ కు ఇతర భాషల్లో మంచి మార్కెట్ ఉందని తెలుస్తోంది.













