విక్రమ్ ఆ రిస్క్ తీసుకుంటాడా?
చియాన్ విక్రమ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అతను ఏ సినిమా చేసినా ఎలాంటి పాత్ర చేసినా 100% ఇస్తాడు. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి విక్రమ్ రెడీగా ఉంటాడు. అలాంటి పాత్రనే విక్రమ్ తన తాజా సినిమా తంగలాన్ లో కూడా చేశాడు. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైంది.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేటవడంతో తంగలాన్ ఇప్పటికే నాలుగు సార్లు పోస్ట్ పోన్ అయింది. గతేడాదిలోనే ఫస్ట్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. తర్వాత సంక్రాంతి అన్నారు. ఆ తర్వాత కూడా మరో రెండు సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. దీంతో సినిమాపై హైప్ క్రమంగా తగ్గింది. ఆదిమ ఆటవిక కమ్యూనిటీకి చెందిన నాయకుడిగా విక్రమ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమా కు కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. జూన్ 20న పాన్ ఇండియా లెవెల్ లో తంగలాన్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఇంకా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే జూన్ 27న కల్కి రిలీజ్ కాబోతుంది. దానికి వారం రోజుల ముందు తంగలాన్ ను రిలీజ్ చేస్తే ఇబ్బందవుతుందేమో అని కొందరంటుంటే మరికొందరు మాత్రం తమిళంలో కల్కి కంటే తంగలాన్కే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే మేకర్స్ జూన్ 20న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయుంటారంటున్నారు. ఏదేమైనా క్రేజ్ ఎలా ఉన్నప్పటికీ తంగలాన్ లో ఓ రేంజ్ కంటెంట్ ఉండి సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్పించి కల్కి ని తట్టుకోవడం కష్టమే.













