విజయ్ ఆ సినిమాను రీమేక్ చేస్తున్నాడా?
తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో గ్రేటెస్ట ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమా చేస్తున్నాడు. టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత విజయ్, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయనున్నట్లు గత కొన్నాళ్ళుగా వార్తలొస్తున్నా విషయం తెలిసిందే.
ఈ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త ప్రచారం అవుతుంది. మొన్నటి వరకు ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తాడన్నారు. కానీ ఇప్పుడు అతని స్థానంలోకి ఖాకీ డైరెక్టర్ H. వినోద్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా డైరెక్ట్ మూవీ కాదట. గతేడాది బాలయ్య-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన భగవంత్ కేసరిని విజయ్ రీమేక్ చేయనున్నాడని అంటున్నారు.
ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్డ్ కాన్సెప్ట్ తో వచ్చిన బిగిల్ విజయ్ కు మంచి ఫలితాన్నిచ్చింది. అందుకే విజయ్ భగవంత్ కేసరి సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. విజయ్ కెరీర్లో 69వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాను త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసిన వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం విజయ్ కు డీవీవీ దానయ్య భారీ రెమ్యూనరేషన్ ను ఇస్తున్నట్లు తెలుస్తోంది.













