బాలయ్య సినిమాకు అదిరిపోయే ఆఫర్
ఎన్టీఆర్ బయోపిక్, రూలర్.. ఇలా వరుసగా డిజాస్టర్లతో ఉన్న నందమూరి బాలయ్యను చూసి అంతా ఆయన పనైపోయిందనుకున్నారు. గతంలో కూడా బాలయ్య నరసింహనాయుడు తర్వాత దాదాపు పదేళ్ల వరకు సక్సెస్ లేక బాగా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత సింహా, లెజెండ్ సినిమాలతో కొన్నాళ్ల వరకు లాక్కొచ్చాడు. తర్వాత మళ్లీ మామూలైపోయింది. వరుసగా డిజాస్టర్ సినిమాలు పడ్డాయి.
దీంతో మళ్లీ బాలయ్య తన మార్క్ సినిమాలతో మెప్పించడం కష్టమే అనుకున్నారంతా. బోయపాటి కూడా ఈసారి బాలయ్యను సేవ్ చేయలేడనుకున్నారంతా. కానీ అఖండ సినిమాతో స్టోరీ మొత్తం ఛేంజ్ అయింది. ఎవ్వరూ ఊహించని స్థాయిలో అఖండ విజయవంతం అయింది. రీసెంట్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన వీరసింహారెడ్డి కూడా మంచి కలెక్షన్లనే రాబట్టుకుంది.
ఇలా బాలయ్య మళ్లీ కెరీర్లో మంచి హైట్ ను అందుకుంటాడని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతేకాదు, ఎవరూ ఊహించలేని ట్రెండీ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడితో సినిమా అనౌన్స్ చేసి మరో సారి జనాల్ని సర్ప్రైజ్ చేశాడు బాలయ్య. బాలయ్య కెరీర్లో 108వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు వస్తున్న బిజినెస్ డీల్స్ చూస్తుంటే మతి పోతుంది.
రిలీజ్‌కు ఇంకా ఆరు నెలలు టైమ్ ఉండగానే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను రూ. 36 కోట్లతో అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఓన్లీ ఓటీటీకే ఈ రేంజ్ రేట్స్ అంటే, ఇక మొత్తం సినిమాకు ఏ విధంగా బిజినెస్ చేస్తుందో ఊహించుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే బాలయ్య చూసిన స్టార్ స్టేటస్ ని ఇప్పుడు మళ్లీ చూస్తున్నాడనే చెప్పాలి.













