సంక్రాంతి రేసులో మరో పెద్ద సినిమా
సంక్రాంతి సీజన్‌ను తలుచుకుంటే బయ్యర్లకు నెల ముందు నుంచే నిద్ర పట్టేలా కనిపించడం లేదు. ఇప్పటికే సంక్రాంతికి అరడజను పైగా సినిమాలు లాక్ అయిపోయాయి. వాటికే థియేటర్లు ఎలా అడ్జస్ట్ అవుతాయా అనుకుంటుంటే ఇప్పుడు తాజాగా ధనుష్ కూడా అదే రేసులోకి దిగాలని చూస్తున్నాడట. ఎంత పోటీ ఉన్నా సరే కెప్టెన్ మిల్లర్ ను సంక్రాంతి సీజన్లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట.
వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 15కు రిలీజ్ కావాల్సింది కానీ సలార్, డుంకీ సినిమాలకు వారం రోజుల ముందు వచ్చి రిస్క్ చేయడమెందుకులే అని డ్రాప్ అయి, ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారట. పీరియాడిక్ మూవీగా వస్తున్న ఈ సినిమాకు వంద కోట్లకు పైగానే పెట్టుబడి పెట్టాడు. ఇప్పటికే గుంటూరుకారం, ఈగల్, సైంధవ్, ఫ్యామిలీ స్టార్, హనుమాన్, నా సామిరంగ, సలాయ్, అయలన్ తో నిండిపోయిన సంక్రాంతి సీజన్ కు ఈ సినిమా కూడో తోడేతే పండగ సినిమాల కౌంట్ తొమ్మిదికి చేరుతుంది.
ఇన్ని సినిమాలున్నా కూడా కొత్త సినిమాలు ఏ ధైర్యంతో ముందుకెళ్తున్నాయో ఎవరికీ పాలుపోవడం లేదు. తమ సినిమా మీద నమ్మకమున్నప్పుడు ఇన్ని సినిమాలతో కలిపి రిలీజ్ చేసి, కలెక్షన్స్ ను తగ్గించుకోవడం ఎందుకులే అనే దిశగా ఎవరూ ఎందుకు ఆలోచించడం లేదో అర్థం కావట్లేదు. మరి ఇన్ని సినిమాల్లో ఏ సినిమా అయినా రిలీజ్ నాటికి వెనకడుగు వేస్తుందేమో చూడాలి.













