Dhanush: ధనుష్ కెరీర్ లో బెస్ట్ యాక్టింగ్

ఇండియన్ సినిమాలో ఉన్న అద్భుతమైన నటుల్లో ధనుష్(dhanush) కూడా ఒకరు. ధనుష్ కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేశాడు. గతంలో వెంకీ అట్లూరి(venky Atluri) దర్శకత్వంలో సార్(sir) అనే తెలుగు సినిమా చేసి మంచి హిట్ అందుకున్న ధనుష్, ఇప్పుడు మరోసారి శేఖర్ కమ్ముల(sekhar kammula) దర్శకత్వంలో కుబేర(kuberaa) అనే సినిమా చేశాడు.
మంచి అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. సినిమా చూసిన వారంతా ధనుష్ యాక్టింగ్ గురించి తెగ మాట్లాడుతున్నారు. సాధారణ ప్రేక్షకుల నుంచి విమర్శకుల వరకు ప్రతీ ఒక్కరూ ధనుష్ నటనను సూపర్ అంటున్నారు. బిచ్చగాడి పాత్రలో ధనుష్ చేసిన యాక్టింగ్ అందరినీ కట్టిపడేస్తోందని సోషల్ మీడియాలో తెగ డిస్కషన్స్ జరుగుతున్నాయి.
సినిమాలో మొదటి సీన్ నుంచి ఆఖరి సీన్ వరకు ధనుష్ తనదైన సహజ నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బిచ్చగాడిగా ఇంట్రో సీన్ లో ధనుష్ చేసిన యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేవా(DEVA) అనే బిచ్చగాడి పాత్రకు ధనుష్ తప్ప మరెవరూ న్యాయం చేయలేరని, మరొకరు అయితే ఈ పాత్ర చేసే సాహసం కూడా చేయరని అనుకుంటున్నారు. ధనుష్ కెరీర్లోనే కుబేర సినిమా బెస్ట్ గా నిలుస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పాజిటివ్ టాక్ తో మొదలైన ఈ సినిమాకు ఇప్పుడు అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి.