Dhanush: ఆయనతో నటించడం నా అదృష్టం

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అనే విషయం తెలిసిందే. హీరోగా, డైరెక్టర్ గా, సింగర్ గా, నిర్మాతగా పలు విభాగాల్లో సత్తా చాటుతూ ప్రతీ విభాగంలోనూ సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం ధనుష్ టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల(Shekar Kammula) దర్శకత్వంలో కుబేర(Kubera) అనే భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ధనుష్ తో పాటూ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇంకా చెప్పాలంటే ఈ సినిమా మల్టీస్టారర్ గానే తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. దానికి తోడు రీసెంట్ గా రిలీజైన టీజర్ కూడా కుబేరపై అంచనాలను పెంచింది. ఇదిలా ఉంటే ఈ సినిమా లో అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన ధనుష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆయనపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
నాగార్జున సినిమాలకు తమిళనాడులో ఇప్పటికీ మంచి క్రేజ్ ఉందని, తనకు పర్సనల్ గా ఆయన సినిమాలంటే ఎంతో ఇష్టమని, మరీ ముఖ్యంగా ఆయన చేసిన రచ్చగన్(Rachagan) సినిమా తన ఆల్‌టైమ్ ఫేవరెట్ అని ధనుష్ తెలిపాడు. కుబేర సినిమాలో తనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఆయన పక్కన నటించడం తన అదృష్టంగా భావించినట్టు చెప్తోన్న ధనుష్, ఆయనతో కలిసి వర్క్ చేసిన కొన్ని రోజుల్ని తాను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని పేర్కొన్నాడు.