ఎక్కడ చూసినా బన్నీనే.. మరి దేవీ ఎక్కడ?
మొన్న నేషనల్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మన తెలుగు వాడు దేవీ శ్రీ ప్రసాద్ పురస్కారం అందుకోవడమంటే మాటలు కాదు. ఇప్పటివరకు రమేష్ నాయుడు, కీరవాణి, థమన్‌లకు మాత్రమే ఆ గౌరవం దక్కింది. కేవీ మహదేవన్, ఇళయరాజా, విద్యాసాగర్ తెలుగు సినిమాలకు ఈ అవార్డులు అందుకున్నారు కానీ వాళ్లు తెలుగు వాళ్లు కాదు. థమన్‌కు తెలుగు మూలాలు ఉన్నప్పటికీ అతను పెరిగిందంతా చెన్నైలో కాబట్టి తమిళ వ్యక్తిగానే చూస్తారు. ఇప్పుడు పుష్ప సినిమాకు గాను నేషనల్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవార్డ్ గెలుచుకున్న దేవీ శ్రీ ప్రసాద్ అచ్చ తెలుగు కుర్రాడు. దేవీది కూడా చెన్నైయే అయినప్పటికీ అతన్ని తెలుగువాడిగానే చూస్తారు.
అలాంటి దేవీకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ దక్కితే, తెలుగు వాళ్లు సరైన రీతిలో సెలబ్రేట్ చేశారా అంటే లేదనే చెప్పాలి. మీడియాలో, సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో దేవీకి ఈ అవార్డ్ రావడంపై అసలు ఎక్కడా పెద్దగా చర్చలే రాలేదు. మీడియా కవరేజ్ కూడా చాలా నార్మల్ గా ఉంది. దేవీ ఎక్కడా హైలైట్ కాకపోవడానికి ఇన్‌డైరెక్ట్ గా బన్నీనే రీజన్.
బన్నీ కూడా పుష్ప మూవీకే అవార్డ్ అందుకోవడం, ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో లీడ్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ గెలుచుకుంది బన్నీనే. దీంతో బన్నీపై అప్రీషియేషన్స్ వర్షం కురుస్తోంది. నాలుగు రోజులు గడుస్తున్నా బన్నీకి అవార్డ్ దక్కడంపై మీడియాలో, సోషల్ మీడియాలో హడావిడి తగ్గలేదు. పార్టీలు, సెలబ్రేషన్లు కూడా తెగ జరుగుతున్నాయి. దేవీ మాత్రం సైలెంట్ గా చెన్నైలో సైలెంట్ గా వర్క్ చేసుకుంటున్నాడు. ఒక విధంగా బన్నీతో పాటూ దేవీకి అవార్డ్ రావడం దేవీ బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి.













