పుష్ప2లో దేవీ శ్రీ ప్రసాద్?
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప2 సినిమాను అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాతో సుకుమార్, బన్నీ చాలా పెద్ద ప్లానే వేసినట్లు తెలుస్తోంది. పుష్ప2లో సుకుమార్ చాలా సర్ప్రైజ్ లు ప్లాన్ చేశాడట. ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న ఈ సినిమాతో థియేటర్లు దద్దరిల్లడం ఖాయమంటున్నారు యూనిట్ సభ్యులు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ తెరంగేట్రం ఉంటుందని టాక్. పుష్ప2లో కొద్ది నిమిషాల పాటూ ఉండే ఓ కీలకపాత్రలో దేవీ శ్రీ ని ఫిక్స్ చేశాడట సుకుమార్. యాక్టింగ్ మీదున్న ఆసక్తితో దేవీ కూడా సుకుమార్ ఆఫర్ కు ఓకే చెప్పాడట.
ఇప్పటికే పుష్పతో మరోసారి పూనకాలు తెప్పించడానికి బన్నీ రెడీ అవుతుంటే దేవీ కూడా ఓ చిన్న క్యామియోతో అదరగొడతాన్న వార్త ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ తెప్పిస్తుంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజమెంతున్నది తెలియదు కానీ సుకుమార్ పుష్ప2 విషయంలో ఒకదాన్ని మించి మరొకటి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడనేది మాత్రం తెలుస్తుంది. పుష్ప2 కోసం ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.













