పుష్ప2 ఫస్టాఫ్ రివ్యూ ఇచ్చేసిన రాక్ స్టార్
పుష్ప2(Pushpa2) సినిమా ఎలా ఉంటుందో పక్కన పెడితే ఆ సినిమాకు వర్క్ చేస్తున్న ప్రతీ ఒక్కరూ పుష్ప2 గురించి నెక్ట్స్ లెవెల్ లో ఎలివేషన్స్ ఇస్తున్నారు. పుష్ప(Pushpa) బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పుష్ప2ని ఇంకా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్(Sukumar). అందుకే ఎప్పుడో ఆగస్ట్ లో రావాల్సిన సినిమా వాయిదా పడి డిసెంబర్ కు వెళ్లింది.
సినిమా వాయిదా పడటంతో పుష్ప2పై ఇంట్రెస్ట్ తగ్గుతుందనుకున్నారు. కానీ ఆ సినిమా గురించి బయటకొస్తున్న అప్డేట్స్ ఫ్యాన్స్ లో ఆసక్తిని ఇంకా పెంచుతున్నాయి. రీసెంట్ గా పుష్ప2 మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) ఆ సినిమా గురించి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పుష్ప2 ఫస్టాఫ్ చూడగానే తన మైండ్ బ్లాక్ అయిందనే రేంజ్ లో దేవీశ్రీ(DSP) చెప్పాడు.
ఫస్టాఫ్ లో కొన్ని సీన్లకు తను, చంద్రబోస్(Chandrabose) కలిసి క్లాప్స్ కొట్టామని, ప్రతి సీన్ ఇదేనా ఇంటర్వెల్ అనిపిస్తుందని దేవీ వివరించాడు. అంతేకాదు బన్నీ యాక్టింగ్, సుక్కూ రైటింగ్ , మేకింగ్ స్టైల్ మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం గ్యారెంటీ అని దేవీ శ్రీ ప్రసాద్ ఎంతో నమ్మకంగా చెప్పాడు. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీగానే జరగనుంది.













