కనెక్షన్స్ లాస్ అవుతున్న దేవీ
రాజమౌళి(rajamouli) దర్శకత్వంలో వచ్చిన సినిమాకు కీరవాణి(keeravani) ఎలా అయితే సంగీతం అందించేవాడో సుకుమార్(Sukumar) సినిమాలకు దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) కూడా అంతే. ఈ కాంబినేషన్ ఎప్పటికీ మారదనే విషయం అందరికీ తెలిసిందే. వీరి కాంబోలో వచ్చే సినిమాలు కూడా అంతే సాలిడ్ గా ఉంటాయి. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఈ బాండింగ్ కు ఎక్కడా బ్రేక్స్ పడలేదు.
అయితే సుకుమార్ తర్వాత కొరటాల(Koratala)తో కూడా దేవీ శ్రీ ప్రసాద్ వరుసగా సినిమాలు చేశాడు. కానీ ఆచార్య(Acharya)తో ఆ బాండింగ్ బ్రేక్ అయింది. రీసెంట్ గా దేవర(Devara)కు అనిరుధ్(Anirudh) తో వర్క్ చేశాడు కొరటాల. ఒక టైమ్ లో దేవీశ్రీ తో వరుస సినిమాలు చేసిన త్రివిక్రమ్(trivikram) కూడా తమన్(Thaman) కు షిఫ్ట్ అయ్యాడు. అంతేకాదు సుకుమార్ టీమ్ లో ఉండే ప్రతీ యంగ్ డైరెక్టర్ దేవీ కి చాలా క్లోజ్ అనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఉప్పెన(Uppena) వరకు సుకుమార్ శిష్యులు చేసిన సినిమాలకు కూడా దేవీనే మ్యూజిక్ చేశాడు. బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకోకుండా కుమారి 21ఎఫ్(Kumari 21F) లాంటి చిన్న సినిమాకు కూడా దేవీ వర్క్ చేశాడు. కానీ ఉప్పెన తర్వాత ఎందుకో కానీ సుక్కు శిష్యుల ఫోకస్ దేవీ పై తగ్గింది. ఉప్పెన డైరెక్టర్ తర్వాత చేయనున్న సినిమాకు ఏకంగా రెహమాన్(A R Rahman) ను తీసుకున్నాడు. సుక్కు మరో శిష్యుడు శ్రీకాంత్ ఓదెల(srikanth odela) కూడా దసరా సినిమాకు దేవీని కాకుండా వేరే వారితో మ్యూజిక్ చేయించుకున్నాడు. రీసెంట్ గా నాని(Nani)తో శ్రీకాంత్ చేయనునన మరో మూవీకి అనిరుధ్ ను తీసుకున్నారు. వాస్తవానికి ఈ సినిమాకు ముందుగా దేవీ పేరునే అనుకున్నారు కానీ మళ్లీ ఏమైందో ఆ ప్లేస్ లోకి అనిరుధ్ వచ్చాడు. చూస్తుంటే టాలీవుడ్ లో దేవీ కాంబినేషన్ కనెక్షన్స్ మెల్లిగా కట్ అవుతున్నట్లు అనిపిస్తోంది. మరి పుష్ప2 తర్వాత దేవీ ఏమైనా బిజీ అవుతాడేమో చూడాలి.













