Devi Nagavalli: డైరెక్టర్ గా మారనున్న జర్నలిస్ట్?
దేవీ నాగవల్లి(Devi Nagavalli) గురించి అందరికీ తెలుసు. ముక్కుసూటిగా మాట్లాడే ఆమె పలుసార్లు వివాదాల్లో నిలిచింది. బిగ్ బాస్4(Bigg Boss4)లోకి కంటెస్టెంట్ గా వెళ్లిన దేవీ మూడు వారాలకే ఎలిమినేట్ అయి బయటికొచ్చింది. ఆ తర్వాత మళ్లీ జర్నలిజం ఫీల్డ్ లోనే కంటిన్యూ అయి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు దేవీ తన జర్నలిజం వృత్తికి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఆమెకు తన కొలీగ్స్ ఫేరెవల్ ఇచ్చిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే దేవీ నాగవల్లి ఇకపై చిత్ర పరిశ్రమలో బిజీ అవనున్నారని, అందుకే ఆమె మీడియాకు గుడ్ బై చెప్పిందని తెలుస్తోంది. డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలో దేవీ ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తోంది.
రీసెంట్ గా వచ్చిన సూపర్ హిట్ పుష్ప2(Pushpa2)కి సైతం దేవీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసింది. పుష్ప2 టైటిల్ కార్డ్స్ లో సైతం నాగవల్లి పేరు ఉంటుంది. సుకుమార్(Sukumar) దగ్గర పని చేయడం తన అదృష్టమని, ఆయన తనకు ఎంతో ధైర్యమిచ్చారని చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి చూస్తుంటే దేవీ నాగవల్లి, సుకుమార్ శిష్యురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చి డైరెక్టర్ గా మారనుందని అర్థమవుతుంది. ఇప్పటికే సుక్కూ శిష్యులు ఎంతోమంది డైరెక్టర్లుగా మారి సక్సెస్ అయిన నేపథ్యంలో దేవీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.













