మరో కొత్త బిజినెస్ లోకి రౌడీ..
తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ తన కెరీర్ స్టార్టింగ్ నుంచే మంచి ఎంటర్ ప్రెన్యూర్ గా ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతున్నారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరో వైపు రౌడీ బ్రాండ్ పేరుతో వస్త్ర శ్రేణి వ్యాపారం ప్రారంభించి అందులో కూడా సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు థియేటర్ బిజినెస్ లో కూడా తనదైన ముద్ర వేసేందుకు రౌడీ ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ సినిమాస్ తో చేతులు కలిపిన దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారం లోకి అడుగుపెట్టారు. ఇప్పటికే AMB సినిమాస్ పేరుతో థియేటర్స్ మొదలు పెట్టి పెద్ద సక్సెస్ అయ్యారు మహేష్ బాబు, ఏషియన్ సినిమాస్. ఇప్పుడు అల్లు అర్జున్ తో కూడా కలిసి ఏషియన్ సినిమాస్ వారు మల్టీ ప్లెక్స్ లని నిర్మిస్తున్నారు. అమీర్ పేట్ సత్యం థియేటర్ ను కొనేసి దాని స్థానంలో కొత్త మల్టీప్లెక్స్ ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు విజయ్ దేవరకొండతో కూడా కలిసి ఏషియన్ సినిమాస్ మూడు స్క్రీన్ల మల్టీప్లెక్స్ ను మహబూబ్ నగర్ లో నిర్మించింది. ఇది వరకు ఈ మల్టీప్లెక్స్ ప్లేస్ లో తిరుమల థియేటర్ ఉండేది. చాలా కాలం క్రితమే ప్రారంభమైన ఈ మల్టీప్లెక్స్ కు AVD సినిమాస్ అని పేరు కూడా పెట్టేశారు. ఈ సమ్మర్ లో వకీల్ సాబ్ సినిమాతో ఏవీడీ సినిమాస్ గ్రాండ్ గా లాంఛింగ్ కు రెడీ అవుతుంది.













