కార్తీ కాస్త ఆగాల్సిందేమో!
ఎన్టీఆర్(NTR) దేవర(Devara) కంటే ఒక రోజు లేట్ గా రిలీజైన కార్తీ(Karthi) సత్యం సుందరం(Satyam Sundaram) సినిమాకు తెలుగులో కూడా మంచి టాక్ వచ్చింది. ఈ సినిమా కంటెంట్ రివ్యూయర్లకు సైతం బాగా కనెక్ట్ అయింది. అందుకే చాలా రేర్ గా వచ్చే త్రీ రేటింగ్ సత్యం సుందరంకు వచ్చింది. కానీ దేవర హంగామాలో సత్యం సుందరం సినిమా జనాలకు పెద్దగా కనిపించడం లేదు.
ఈ సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేసింది సురేష్ ప్రొడక్షన్స్(Suresh Productions), ఏషియన్స్(Asian Movies) సంస్థలైనప్పటికీ బీ, సీ సెంటర్లలో పెద్దగా స్క్రీన్లు దక్కలేదు. చిన్న సెంటర్లలో అసలు సినిమా రిలీజే కాలేదు. దీంతో ఆడియన్స్ కు దేవర తప్ప మరో ఆప్షన్ కనిపించడంలేదు. ఇద్దరి వ్యక్తుల మధ్య ఎమోషన్స్ ను హైలైట్ చేస్తూ డైరెక్టర్ ప్రేమ్ కుమార్(Prem Kumar) ఈ సినిమాను నడిపించిన తీరు ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఇంప్రెస్ చేస్తుంది.
ముఖ్యంగా సినిమాలో కార్తీ నటనకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. ఎదుటివాళ్లు ఏమనుకుంటున్నారనేది పట్టించుకోకుండా అస్తమానం మాట్లాడుతూనే ఉండే పాత్రలో నటిస్తూనే మరోవైపు ఎమోషన్స్ ని పండించి గుండెలు పిండేశాడు. సినిమాకు పికప్ ఉన్నప్పటికీ దేవరతో కాకుండా మరో వారం లేటు గా వచ్చి ఉంటే ఈ సినిమా పరిస్థితి మరోలా ఉండేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.













