డే1 దేవర రికార్డులు
అందరూ అనుకున్నట్లే దేవర1(Devara1) ఓపెనింగ్స్ అదిరిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ట్రెండ్ సృష్టించిన దేవర దానికి మరింత బలాన్ని చేకూర్చడంతో ఈసారి ఏకంగా నాన్ ఆర్ఆర్ఆర్(RRR) నెంబర్స్ ను టార్గెట్ చేసి ఆ దిశగా పరుగులు పెడుతోంది. పబ్లిక్ టాక్ యునానిమస్ హిట్ అని రాకపోయినప్పటికీ దేవరను కచ్ఛితంగా ఒకసారి చూడొచ్చనే టాక్ పబ్లిక్ లోకి వెళ్లిపోయింది.
దీంతో వీకెండ్ బుకింగ్స్ చాలా భారీగా జరిగాయి. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, దేవర తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు. రూ.54 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. నైజాంలోనే సుమారు రూ.20 కోట్లు వసూలు చేసిందంటే ఎన్టీఆర్(NTR) మార్కెట్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం అవుతుంది. సీడెడ్ లో కూడా రూ.10 కోట్లు దాటడం కొత్త రికార్డు.
గుంటూరు, వైజాగ్ మిగిలిన ఏరియాల్లో కూడా నెవర్ బిఫోర్ రికార్డ్స్ నమోదవుతున్నాయి. ఇవాళ కార్తీ(Karthi) సత్యం సుందరం(Satyam Sundaram) రిలీజ్ అవుతున్నప్పటికీ ఈ వీకెండ్ లో అయితే ఆ సినిమాకు పెద్దగా కలెక్షన్స్ రావడం కష్టమే. దేవర వేట మొదలైంది ఇప్పుడు కాబట్టి ఈ సినిమా రేంజ్ ఎక్కడివరకు వెళ్తుందనేది చెప్పడానికి కనీసం వారమైనా పడుతుంది. ఓవర్సీస్ లో 3 మిలియన్ మార్క్స్ ను చాలా ఈజీగా దేవర క్రాస్ చేసింది. వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే కల్కి(Kalki)ని దేవర రూ.87 కోట్ల షేర్ తో కల్కిని దాటేసి నెం.1 పొజిషన్ లో ఉంది.













