సెన్సార్ పూర్తి చేసుకున్న డిగ్రీకాలేజ్
నరసింహ నంది దర్శకత్వంలో శ్రీ లక్మ్షీ నరసింహ సినిమా పతాకంపై తెరకెక్కిన చిత్రం డిగ్రీ కాలేజ్. వరుణ్, దివ్వారావు జంటగా నటించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 7న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. దర్శకుడు మాట్లాడుతూ ఇదివరకు నేను తీసిన చిత్రాలకి భిన్నంగా.. వాణిజ్యాంశాల్ని మేళవించి రూపొందించిన సినిమా ఇది. డిగ్రీ కాలేజీలో ఇద్దరు విద్యార్థుల మధ్య అంకురించిన ప్రేమ ఎక్కడిదాకా దారి తీసిందన్నది తెరపైనే చూడాలి. యథార్థ సంఘటనల ఆధారంగా సహజత్వానికి పెద్దపీట వేస్తూ రూపొందించిన చిత్రమిది. కథానుగుణంగా రొమాంటిక్ అంశాల్ని జోడించాం అన్నారు. చిత్రాన్ని పంపిణీ చేస్తున్న బాపిరాజు మాట్లాడుతూ ప్రేమ, రొమాంటిక్ అంశాలే కాకుండా.. భావోద్వేగాలు కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. అందుకే ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నాం అన్నారు.













