దీపికా పదుకొనె కు బంపర్ ఆఫర్!
దీపికా పదుకొనె రెండేంళ్ల క్రితం హాలీవుడ్‌లోకి అడుగు పెట్టి త్రిబులెక్స్: రిటర్న్ ఆఫ్ గ్జెండర్ కేజ్ చిత్రంలో నటించి అందం, అద్భుతమైన యాక్షన్‌తో హాలీవుడ్ ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. తాజాగా మరోసారి హాలీవుడ్ ఆడియెన్స్‌ని అలరించడానికి సిద్ధమవుతుంది. త్రిబులెక్స్ చిత్ర సిరీస్‌లో భాగంగా రాబోయే నాలుగో చిత్రంలో మెయిన్ లీడ్‌గా దీపికా నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు డీజే కరుసో సృష్టం చేయడం విశేషం. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకి కరుసో స్పందిస్తూ దీపికాతో పని చేయాలని మేం కూడా అనుకుంటున్నాం. కొత్త ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పూర్తయింది. త్వరలో దీపికాని కలుస్తాం అని ట్వీట్ చేశారు.. దీంతో దీపికా ఫ్యాన్స పుల్ ఖుషీ అవుతున్నారు.













