గంగూబాయ్ లో దీపికా పదుకోన్ స్పెషల్ సాంగ్
మాఫీయా క్వీన్ గంగూబాయ్ కోసం దీపికా పదుకోన్ ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని బాలీవుడ్ తాజా వార్త. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం గుంగూబాయ్ కతియావాడి. ఈ చిత్రంలో ఆలియా భట్ టైటిల్ రోల్ చేస్తున్నారు. అజయ్ దేవగన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారని టాక్. ముంబైకి చెందిన గ్యాంగ్‌స్టర్ గుంగూబాయ్ జీవితం ఆధారంగా ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. కథ రీత్యా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌కి స్కోప్ ఉందట. ఈ పాట కోసం దీపికా పదుకోన్‌ను సంప్రదించారట. ఈ సినిమాకు ముందు దీపికా పదుకోన్‌కు పద్మావత్ రూపంలో మంచి హిట్ ఇచ్చారు భన్సాలీ. అందుకని గుంగూబాయ్లో ప్రత్యేక పాట చేయడానికి దీపిక సై అంటారని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.













