Deepika Padukone: దీపికాను ప్రభావితం చేసిన రెండు నగరాలు
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతోంది. దీపికా బాలీవుడ్ లో రాణిస్తున్నప్పటికీ తన కెరీర్ స్టార్ట్ చేసింది మాత్రం సౌత్ నుంచే. ఉపేంద్ర(Upendra) సరసన హీరోయిన్ గా నటించి సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైన దీపికా ఓం శాంతి ఓం(Om Shanthi Om) తో బాలీవుడ్ లోకి ఎంటరై అక్కడ మంచి బ్లాక్ బస్టర్ ను అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాల్లో నటించింది.
ఎంత స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తన దగ్గర ఓ ప్రశ్నకు మాత్రం సమాధానం లేదంటోంది దీపికా. బెంగుళూరు, ముంబై లో ఏది ఇష్టమనే ప్రశ్నకు తాను సమాధానం చెప్పలేనని చెప్తోన్న దీపికా రీసెంట్ గా ఈ విషయంపై ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తన చిన్నతనం మొత్తం బెంగుళూరులోనే గడించిందని, ఇప్పుడు దాన్ని మిస్ అవుతున్నానని చెప్పింది దీపికా.
ఇప్పుడు ఎప్పుడైనా బెంగుళూరు వెళ్తే తన ఇంటికి వెళ్లినట్టు అనిపిస్తుంటుందని చెప్పిన దీపికా తన లైఫ్ లో ఎక్కువ భాగం బెంగుళూరులోనే గడిపానని, తన స్నేహితులు, స్కూల్, కాలేజ్ అన్నీ బెంగుళూరులోనే ఉన్నాయని, ఎప్పుడు బెంగుళూరు వెళ్లినా ఆ రోజులన్నీ గుర్తొస్తాయని చెప్తోంది దీపికా. ఇక ముంబై గురించి చెప్పాలంటే ముంబై తనకు కెరీర్ ను ఇచ్చిందని, ప్రస్తుతం ముంబైలోనే ఉంటున్నానని, ఈ రెండు నగరాలు తన లైఫ్ ను ఎంతో ప్రభావితం చేశాయని దీపికా చెప్తోంది.
https://www.instagram.com/













