ఇవి లేకపోతే ప్రేమ నిలబడదు…దీపికా
నేను ప్రేమలో ఉన్నప్పుడు మోసం చేయలేదు. అతడు మోసం చేస్తాడని నా చుట్టూ ఉన్న వ్యక్తులు చెబుతున్నా, అతడు వేడుకోవడంతో రెండో అవకాశం ఇచ్చా. అది నా మూర్ఖత్వం అని ఆవేదన వ్యక్తం చేసింది దీపికా పదుకొనె. ప్రేమలో విఫలమై మానసిక ఒత్తిడికి గురైన సందర్భాన్ని ఇటీవల దీపికా, రణ్బీర్ కపూర్ ప్రేమించుకుని, విడిపోయారు. అయితే ఆ బంధం తాలుకా చేదు జ్ఞాపకాల గురించి తెలియజేస్తున్న సందర్భంలో దీపికా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మోసం ఓ బంధాన్ని బ్రేక్ చేస్తుంది. ఒక్కసారి అలా జరిగే గౌరవం, నమ్మకం పోతుంది. ఇవి లేకపోతే ప్రేమ నిలబడదు. ఈ బ్రేకప్ నాకొక గుణపాఠం అని దీపికా చెప్పారు.













