ఆయనతో కలిసి నటించాలని ఉంది.. దీపికా
ఛపాక్ సినిమా ప్రమోషన్లో భాగంగా సల్మాన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ సీజన్ 13కి దీపిక వెళ్లారు. మనమిద్దరం కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. నిజం చెప్పాలంటే నాకు కూడా సల్మాన్‌తో కలిసి పని చేయాలని ఉంది. మంచి కథ ఉంటే మేమిద్దరం తప్పకుండా కలిసి నటిస్తాం. ఆయన నటించిన హమ్ దిల్‌దే చుకే సనం సినిమా అంటే నాకెంతో ఇష్టం. ఆయన ఎప్పటిలా కాకుండా విభిన్నమైన పాత్రల్లో నటిస్తే చూడాలని ఉంది. సల్మాన్‌తో కలిసి నటించాలంటే ఇప్పటి వరకు నాకు ఎలాంటి ఆఫర్ రాలేదు. వస్తే తప్పకుండా నటిస్తా అని అన్నారు.













