Deepika Padukone: ప్రెగ్నెన్సీ టైమ్ లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone)- రణ్వీర్ సింగ్(Ranvir Singh) ను పెళ్లి చేసుకుని గతేడాది ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పాప పుట్టిన తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న దీపిక ఇప్పుడు మళ్లీ షూటింగుల్లో పాల్గొని మేకప్ వేసుకునేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక ప్రెగ్నెన్సీ టైమ్ లో జర్నీ గురించి మాట్లాడింది.
ప్రెగ్నెన్సీ టైమ్ లో నెలలు నిండేకొద్దీ చాలా కష్టంగా ఉండేదని చెప్పిన దీపిక ఆ ప్రయాణంలో తానెన్నో సవాళ్లను ఎదుర్కొన్నానంది. ముఖ్యంగా 8, 9 నెలల్లో ఎంతో కష్టంగా అనిపించిందని, టైమ్ లో తన కుటుంబం, స్నేహితులు తనతోనే ఉన్నారని, ఆ విషయంలో తానెంతో లక్కీ అని భావిస్తానని చెప్పుకొచ్చింది దీపికా.
కూతురికి పేరు పెట్టడానికి ఎంతో ఆలోచించి మరీ దువా(Dua) అని పెట్టానని, దానికి అర్థం ప్రార్థన అని చెప్పిన దీపిక త్వరలోనే షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలిపింది. ఓ వైపు తల్లిగా ఉంటూ, మరోవైపు నటిగా షూటింగులకు హాజరవడం ఎంతో పెద్ద సవాలని చెప్పిన తాను, తల్లి బాధ్యతని నెరవేరుస్తూనే షూటింగుల్లో పాల్గొంటానని వెల్లడించింది.






