Deepika Padukone: ఆస్కార్‌ను ఇండియన్స్ కు రాకుండా చేస్తున్నారు
చలన చిత్ర పరిశ్రమలో అన్నిటికంటే ఎంతో గొప్ప అవార్డు ఆస్కార్(Oscar). దీని కోసం ప్రతీ ఒక్కరూ కలలు కంటూంటారు. అయితే తాజాగా దీపికా పదుకొణె (Deepika Padukone) ఆస్కార్ అవార్డ్స్ గురించి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఇండియాలో ఎంతోమంది టాలెంటెడ్ నటీనటులున్నారని, ఇండియన్ సినిమాలో ఎన్నో గొప్ప కథలు తెరకెక్కాయని ఆమె ఈ సందర్భంగా తెలిపింది.
ఇండియన్ సినిమా ఎన్నో గొప్ప సినిమాలను తీసినప్పటికీ ఆ సినిమాలకు, అందులో పనిచేసిన వారికి తగిన గుర్తింపు రాలేదని, ఎన్నో సందర్భాల్లో ఇండియన్స్ తీసుకోవాల్సిన ఆస్కార్ ను మనం నుంచి దూరం చేశారని దీపిక అభిప్రాయపడింది. ఆర్ఆర్ఆర్(RRR) లోని నాటు నాటు(Naatu Naatu) సాంగ్ కు ఆస్కార్ వచ్చినప్పుడు తాను అక్కడే ఆడియన్స్ లో ఉన్నానని, ఆ టైమ్ లో తాను ఎంతో భావోద్వేగానికి గురైనట్టు దీపిక చెప్పుకొచ్చింది.
ఆర్ఆర్ఆర్ కు, తనకు ఎలాంటి సంబంధం లేదని కేవలం ఓ భారతీయురాలిగా మాత్రమే తనకు ఆ క్షణంలో గర్వంగా అనిపించిందని, ఆ గొప్ప మూమెంట్ ను తానెప్పటికీ మర్చిపోలేనని దీపిక తెలిపింది. ఈ ఇయర్ ది బ్రూటలిస్ట్(The Brutalist) మూవీకి అడ్రియన్ బ్రాడీ(Adrien Brody)కి బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ రావడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని దీపిక తెలిపింది.













