Deekshith Shetty: గాయాలైనా సాంగ్ ప్రాక్టీస్ చేశా

నేచురల్ స్టార్ నాని(nani) హీరోగా వచ్చిన దసరా(Dasara) సినిమాలో నానికి ఫ్రెండుగా నటించి అందరినీ తన నటనతో మెప్పించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు దీక్షిత్ శెట్టి(Deekshith Shetty). ఆ తర్వాత దీక్షిత్ తెలుగులో పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం రష్మిక మందన్నా(Rashmika Mandanna), దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ది గర్ల్‌ఫ్రెండ్(The Girl Friend). రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి తాజాగా మేకర్స్ నదివే(Nadhive) అనే సాంగ్ ను రిలీజ్ చేయగా ఆ సాంగ్ కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజైన ఆ పాటకు యూట్యూబ్ లో మంచి వ్యూస్ ఇప్పటికే వచ్చాయి. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీక్షిత్ ఆ సాంగ్ షూటింగ్ లో జరిగిన అనుభవాలను షేర్ చేసుకున్నాడు.
గతంలో రియాలిటీ షో లో విన్నర్ గా నిలిచిన తాను మొదటిసారి సినిమా కోసం చేసిన డ్యాన్స్ ఇదేనని, కొరియోగ్రాఫర్ విశ్వకిరణ్ నంబి(Viswa Kiran Nambi) తో కలిసి వారం రోజుల పాటూ చాలా ట్రై చేశానని, సినిమాలో మ్యూజిక్ కు తగ్గట్టు డ్యాన్స్ చేయడం చాలా కష్టమని, లైవ్ షో లో ఇలాంటివి చేసేటప్పుడు ఏదైనా తప్పులు జరిగినా పెద్దగా పట్టించుకోరని, కానీ సినిమాలో అవన్నీ కుదరవని, ఈ సాంగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు రష్మికకు, తనకు చిన్న గాయాలు కూడా అయ్యాయని దీక్షిత్ తెలిపాడు.