ఇంటి దగ్గర మీరు ఇలా చెయ్యొద్దు
ఓ పక్క చీరకట్టులో సింగారించుకొని అంబాసిడర్ కారుపై కూర్చొన్న టబు, మరో పక్క మోడ్రన్ డ్రెస్ వేసుకొని ఖరీదైన కారుపై కూర్చొని హోయలొలికిస్తున్న రకుల్‌ప్రీత్ సింగ్.. మధ్యలో ఈ రెండు కార్లపైన చేరో కాలు వేసి సాహస విన్యాసం చేస్తున్న అజయ్‌దేవ్‌గణ్. చూడాటానికి మనకు భలే సరదాగా ఉన్న అక్కడ అజయ్‌కు మాత్రం చుక్కలు కనిపిస్తున్నట్లుగానే ఉంది యవ్వారం. మరి ఇరువురి భామల మధ్య అజయ్ కథేంటో తెలుసుకోవాలంటే దే దే ప్యార్ దే చూడాల్సిందే. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. దీనికి సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన లభిస్తోంది. ఈ ఫొటోను ట్విటర్లో పంచుకుంటూ ఇంటి దగ్గర మీరు ఇలా చెయ్యొద్దు అంటూ ఫన్నీగా ట్వీటారు అజయ్ దేవగణ్. అకివ్ అలీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ట్రైలర్‌ను వచ్చే నెల 2న అజయ్ పుట్టినరోజు కానుకగా విడుదల చేయనున్నారు. మే 17న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.













